Saturday, April 25, 2009



మా మిత్రుడి నాన్నగారు మమ్మల్ని విడిచి స్వర్గహస్తులయారు..దానికి నా మనుస్సు పడిన స్పందన ..నా ఆవేదన ....




ఎవేరిని అడగను ..ఏమని అడగను ??





నాన్న ..




గుండెలపె తన్తే ఆ స్పర్శలో ఉంది అన్నారు ఆనందం




మా కోసం కష్టపడిన ..మా నవ్వులో కనపడింది అన్నారు ఆనందం ..




అలసి వచ్చిన మీకు ..అమ్మ అప్యాయతపు పలకరింపులో కనపడింది అన్నారు ఆనందం




చిట్టి చెల్లి కోసం ఆమె చేతిలో బొమ్మగా మారడంలో ఉంది అన్నారు ఆనందం .




మా బంగారు భవిష్యతు కోసం కన్నా మీ కలలో కనపడింది అన్నారు ఆనందం .



మమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళడంలో కూడా మీకు ఆనందం ఉందా




నాన్న ?????



చెప్పండి నాన్న ............











నేను మిమ్మల్ని పున్నమనరకం నుంచి తపిస్తాను అన్నారు .........




మరి మీరు వదిలివెళ్ళిన ఈ "ఒంటరితనం" నరకంను నుంచి నన్ను ఎవేరు తపిస్తారు నాన్న?




నాకు మాటలు నేర్పిన మీరు మూగపోతే ..నాకు మాటలు ఎలా వస్తాయి నాన్న?




మిమ్మల్ని రాజాలాగా సుఖపెడదము అనుకుంటే ..నాకు దూరం అయ్యి నన్ను కష్టపెడుతున్నర నాన్న?




మీలో ఆర్ధబాగం అమ్మని నేను ఎలా అనునయించగలను నాన్న?




చెల్లి చెమ్మగిల్లిన కళ్ళను ఏమని చెప్పి తుడవాలి నాన్న ?




మీ చేయి పట్టుకుని నడిచిన నేను. ఇపుడు వదిలేస్తే నేను ఎ దారిన వెళ్ళాలి నాన్న?



ఈ ప్రశ్నలకి సమాధానములు ఎవేరిని అడగను నాన్న?




మీకు దూరంగా ఈ జనారణ్యంలో ఒంటరిగా ఉన్న కాలంని అడగనా.




మీరు కనపడకపోతే అమ్మ చూసే ఎదురుచూపులను అడగనా .




"నాన్నగారు ఇంకారాలేదా " అని చెల్లి పలికే మాటలను అడగనా ...




చెప్పండి నాన్న ............


0 comments:

Post a Comment