అనగా అనగా .
అది ఒక అరణ్యం.
అక్కడ ఒక ముని పొందాలి అనుకున్నాడు ఆ దేవుని అనుగ్రహం.
తప్పస్సు చేసాడు నిద్రాహారాలు మాని.
దేవుడు అతని దీక్షకు మెచ్చి ,
అడిగాడు వరములు ....కోరుకోమని.
ఓ సృస్తికర్త,
ఓ సృస్తికర్త,
ఇదిగో నా కోరికల చిట్టా.
నాకు కావాలి ఈ భూమిమీద ఆధిపత్యం.
నన్ను చూసి భయపడాలి సత్యం..
నేను ఎక్కడ ఉంటె అక్కడ కావాలి మానవత్వం మాయం.
దయ పరుగులు పెట్టాలి దూరం...
నేను లేకపోతే మానవుడికి రావాలి కష్టకాలం.
నా గురించే ఆలోచించాలి మానవుడు జీవితకాలం.
అన్యాయముకి కావాలి నేను అండ.
సమాజంలో న్యాయ దేవత ఉండకుండా.
ఇవ్వని చేయాలి అంటే ,నాకు వద్దు మానవ రూపం.
నాకు ఇవ్వు మరో స్వరూపం.
దీనికీ ఆ సృస్తికర్త...అ ముని కి ఇచ్చాడు మానవేతర ..రూపం.
అదే నేటి సమాజంకి మూలం.
ధనం..
ఇది ధనం వెనుక ఉన్న కధనం…


0 comments:
Post a Comment