Friday, July 16, 2010

ఆనాటి హరిచంద్రుడు ఇతనికి కవల

కర్ణుడు ,ఏకలవ్యుడు ఇతనికి అన్నదమ్ముల ..

మేనక ఇతనికి మరదలా.

మంచితనంకి మానవరూపంలా .

ఆ నవ్వు మన్మదుడి బాణంలా.

అనిపించిలే ఉంటాడు మా నరేష్ కవల.

Monday, June 21, 2010





Conditions Apply..RAMA IS MAN but RAVANA IS ALSO MAN
నమ్మోదు ఈ మగమహరాజులను


మగువ మనుస్సు అర్ధం కానీ ఈ బుద్ధిహినులను..




మొదట చెప్పే మాటలు మొగలి రేకులు..


ఆ రేకుల రెండో వెపు చూడ నివ్వదు పురష ప్రేమ ప్రక్రియలు.




చుసేలోపు నీ మెడలోఉంటాయి మంగళసూత్రాలు


నీ మాటలను మౌనంగా మార్చే ప్రతిబంధకాలు




ఈ పురుషరేడు ..


ప్రేమ కోరుకునే మగాడు.


ప్రేమ ఇవ్వని మొగుడు..............




సేవలు చేస్తే saree అంటాడు.


నాకు help చెయ్యి అంటే sorry అంటాడు.
magadu..


నిమిషం .ఒక యుగం నీ కోసం వేచే వేళలో ..అంటాడు


ఏడు అడుగాలకు ముందు.


ఇక ముందు.


నీతో నిమిషం ఉంటె నాకు యుగం వృధా అంటాడు..ఈ పతిదేవుడు..




దొంగ మాటలు చెపే మాటకారులు ఈ మగాలు.


సహనం లేని సచ్చినోలు..


ఈ ...మీసం ఉన్న దేవుడు బొమ్మలు.




నిన్ను తనకి తగ్గటు మార్చుకుంటాడు ఈ వీరుడు..


నా కోసం నువ్వు మారవ అంటే ..నా చేయి నీకు సమాదానం అంటాడు.




పక్కింటి పుల్ల కూరా వీడికి రుచి..


ఇంటి food వీడికి ఉంటాదు RUCHI..




నువ్వు పెళ్లి చేసుకునే ముందు ఆలోచించు ఓ విపంచి.


ఎందుకు అంటే నీ పతి లో కూడా ఉండచు ఈ పిశాచి..


Tuesday, December 1, 2009



ఇది నా ఊహా ...
ఈ కవిత కి సందర్బం ..
ఇద్దరు అమ్మాయి,అబ్బాయి ఫోనులో పరిచయం.అబ్బాయి..అమ్మాయికి అబ్బాయితన ప్రేమ విషయం చెప్పుతాడు.
అప్పుడు
అమ్మాయి:నా గురుఇంచినీకు ఏమి తెలుసు..నేను ఎవేరో నీకు తెలుసా..అని అడిగింది.
అబ్బాయి.:అవును నువ్వు ఎవేరో నాకు తెలియదు..నీ మోము నాకు తెలియదు..
కానీ..నువ్వు అని ఈ కవితరుపంలో చెప్పుతాడు.



నా ...............


ఊసులు ఉయాలాకి మలయమారుతం ..

ఆశల అవని అందించే నా పాలిట వరం.

మాటల గారడితో నన్ను మాయ చేసే మకరందం.

నాలోని భావాలకు కలం ఇచ్చి వాటిని అక్షరాలుగా మార్చిన ప్రేమపుస్తకం.

ఎందుకు నా జీవితం అను ప్రశ్నకు సమాదానం ...

ఎవరికోసం నా జనననం అన్నా నాలోని నిరాశకి ఆశాజనకం.

నా జీవితపు నిఘుమ్తువులో ప్రేమ కి అర్ధం.


నీ కోసం చచ్చిపోగలనుఅన్నానా గుండె దేర్యం.

నా మాతృమూర్తి తరవాత నా హృదయంలో రెండవ స్థానం ..

నువ్వే అని తెలుసా నా ప్రాణం .

నువ్వు కాదు అంటే నాకు తెలుసు మరణమే నా గమ్యం.

అందుకే దయచేసి చూపించు నీ వదనం.

ఇంక చాలించు నీ మాటలతో చేసి నా మనస్సు మదనం.

Monday, November 30, 2009







ఏమది ?


ఏమది ...ఏమది ..........ఏమది


అప్పుడే వస్తునాదా రెండువేలపది..


మొన్నే కాదా వచ్చింది రెండువేలతోమ్మిది..


ఎంత వేగిరం కాలం అనేది ...

నా జీవితంలో ప్రేమ నింపినది ..


...ద్వేషాలను రేపినది
కొత్త మిత్రులను కలిపినది.


నా వయస్సుకి ఒకటి కలిపినది.
నా అయుషుకి ఒకటి దూరం చేసినది.


సంతోషం పంచినాది ..
బాధలను పెంచినాది .

....ఈ రెండువేలతోమ్మిది..

చేదాము అనుకున్నా అది ఇది.

చేసేలోపు ..వీడుకోలు పలికింది .

..ఈ రెండువేలతోమ్మిది ....

పాత స్మ్రుతలకు సమాది.

కొత్త కలలకు పునాది ..

ఈ రెండువేల పది ...

ఈ వసంతం అయిన చేయాలి నేను అనుకున్నది ..




కాలం ...
ఒకసారి వెళ్ళితే తిరిగిరాని సృష్తివిచిత్రం.

మనుషలకి అందని వేగం
ఎవెరి కోసం ఆగని తత్త్వం.

మానవ సంభాదాల విలువలు తెలిపే అద్దం ..
అయుషుకు విలోమనుపాతం

మిత్రులను ప్రాణ మిత్రులాగా మార్చేబలం ..
ప్రేమికుల ఎడబాటుల ఎడారిలో ..వేసవి...ఈ కాలం

కాంతి వేగం అందుకోవాలి అంటే ఉండాలి కాలం నీ చెంత..
లేకపోతే నీకు తప్పదు అంధకారం అనే చింత..

ఈ కాలంతో పయనం
౧౦౦ వర్షాలు చేయాలని అని మీ జీవితం ..

మీ కలలు అవ్వాలి మీ సొంతం.
దాని నిజం చెయ్యాలి నూతన వసంతం ............


Sunday, April 26, 2009



ఒక అమ్మాయి తన తల్లితండ్రులకు దూరంగా ఉండలేక ..
పెళ్లి చేసుకోను అని చెప్పలేక .
ఆమె మనస్సు పడే మనోవేదన ..
(చివరికి చేసుకుంటారు అనుకోండి..ముందు ఈ భయం అందరికి ఉంటుంది కదా అండి )

ఏదో .

మనస్సు ఏదో..

గోల చేస్తోంది ఈనాడు .

అది ఈ రోజు వినను అంది నా గోడు ..

మా అమ్మ మాట కాదు అనలేదు నేను ఏనాడు ....

పెళ్లి అంటే వద్దు అని అంటోంది నా ఈడు ....

నాన్న చేసే గారబం..

అమ్మ చూపే అనురాగం...

అన్నతమ్ములుతో చేసే అల్లరి కోలాహలం .


అక్క చెల్లిలతో పంచుకునే చిలిపి కబురుల తీయదనం ..

నన్ను వాళ్ళ ప్రేమతో నన్ను తడిపే బంధుగణం..

ఇవ్వని వదిలి వెళ్ళడం కాదు నా తరం...

పెళ్లి చేసుకోవాలి అనే ఆచారం ??

ఉందా దాని అవసరం??

ఏమో అది అంత నాకు అనవసరం ..

నాకు వద్దు కొత్తవ్యక్తితో పరిచయం..

కొత్త మనుషుల లోగిలలో నేను చేయలేను గృహప్రవేశం ..

అల్లరి అమ్మాయని ..అర్ధాంగిగా మారాలంటే నాకు వేస్తోంది భయం

నాన్న,అమ్మ

పెళ్లి చేసుకుని నేను వెళ్ళాను మీకు దూరం ..

కాని తప్పదు "అమ్మ" అని అన్నపుడు

మీ కళ్ళలో కనపడింది బాధ్యతల భారం..

దానికి ఈ నాడు నేను తలదించక తప్పదు అంటోది నా జ్ఞానం ..

Saturday, April 25, 2009



మా మిత్రుడి నాన్నగారు మమ్మల్ని విడిచి స్వర్గహస్తులయారు..దానికి నా మనుస్సు పడిన స్పందన ..నా ఆవేదన ....




ఎవేరిని అడగను ..ఏమని అడగను ??





నాన్న ..




గుండెలపె తన్తే ఆ స్పర్శలో ఉంది అన్నారు ఆనందం




మా కోసం కష్టపడిన ..మా నవ్వులో కనపడింది అన్నారు ఆనందం ..




అలసి వచ్చిన మీకు ..అమ్మ అప్యాయతపు పలకరింపులో కనపడింది అన్నారు ఆనందం




చిట్టి చెల్లి కోసం ఆమె చేతిలో బొమ్మగా మారడంలో ఉంది అన్నారు ఆనందం .




మా బంగారు భవిష్యతు కోసం కన్నా మీ కలలో కనపడింది అన్నారు ఆనందం .



మమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళడంలో కూడా మీకు ఆనందం ఉందా




నాన్న ?????



చెప్పండి నాన్న ............











నేను మిమ్మల్ని పున్నమనరకం నుంచి తపిస్తాను అన్నారు .........




మరి మీరు వదిలివెళ్ళిన ఈ "ఒంటరితనం" నరకంను నుంచి నన్ను ఎవేరు తపిస్తారు నాన్న?




నాకు మాటలు నేర్పిన మీరు మూగపోతే ..నాకు మాటలు ఎలా వస్తాయి నాన్న?




మిమ్మల్ని రాజాలాగా సుఖపెడదము అనుకుంటే ..నాకు దూరం అయ్యి నన్ను కష్టపెడుతున్నర నాన్న?




మీలో ఆర్ధబాగం అమ్మని నేను ఎలా అనునయించగలను నాన్న?




చెల్లి చెమ్మగిల్లిన కళ్ళను ఏమని చెప్పి తుడవాలి నాన్న ?




మీ చేయి పట్టుకుని నడిచిన నేను. ఇపుడు వదిలేస్తే నేను ఎ దారిన వెళ్ళాలి నాన్న?



ఈ ప్రశ్నలకి సమాధానములు ఎవేరిని అడగను నాన్న?




మీకు దూరంగా ఈ జనారణ్యంలో ఒంటరిగా ఉన్న కాలంని అడగనా.




మీరు కనపడకపోతే అమ్మ చూసే ఎదురుచూపులను అడగనా .




"నాన్నగారు ఇంకారాలేదా " అని చెల్లి పలికే మాటలను అడగనా ...




చెప్పండి నాన్న ............