Monday, November 30, 2009







ఏమది ?


ఏమది ...ఏమది ..........ఏమది


అప్పుడే వస్తునాదా రెండువేలపది..


మొన్నే కాదా వచ్చింది రెండువేలతోమ్మిది..


ఎంత వేగిరం కాలం అనేది ...

నా జీవితంలో ప్రేమ నింపినది ..


...ద్వేషాలను రేపినది
కొత్త మిత్రులను కలిపినది.


నా వయస్సుకి ఒకటి కలిపినది.
నా అయుషుకి ఒకటి దూరం చేసినది.


సంతోషం పంచినాది ..
బాధలను పెంచినాది .

....ఈ రెండువేలతోమ్మిది..

చేదాము అనుకున్నా అది ఇది.

చేసేలోపు ..వీడుకోలు పలికింది .

..ఈ రెండువేలతోమ్మిది ....

పాత స్మ్రుతలకు సమాది.

కొత్త కలలకు పునాది ..

ఈ రెండువేల పది ...

ఈ వసంతం అయిన చేయాలి నేను అనుకున్నది ..




కాలం ...
ఒకసారి వెళ్ళితే తిరిగిరాని సృష్తివిచిత్రం.

మనుషలకి అందని వేగం
ఎవెరి కోసం ఆగని తత్త్వం.

మానవ సంభాదాల విలువలు తెలిపే అద్దం ..
అయుషుకు విలోమనుపాతం

మిత్రులను ప్రాణ మిత్రులాగా మార్చేబలం ..
ప్రేమికుల ఎడబాటుల ఎడారిలో ..వేసవి...ఈ కాలం

కాంతి వేగం అందుకోవాలి అంటే ఉండాలి కాలం నీ చెంత..
లేకపోతే నీకు తప్పదు అంధకారం అనే చింత..

ఈ కాలంతో పయనం
౧౦౦ వర్షాలు చేయాలని అని మీ జీవితం ..

మీ కలలు అవ్వాలి మీ సొంతం.
దాని నిజం చెయ్యాలి నూతన వసంతం ............