Monday, April 6, 2009






ఎలా తెలుపను



ప్రియా!!



ఎలా తెలుపను



ఎదలోతులో ఎదిగిన నీ మీద అంతులేని ప్రేమని,



నా కనుసన్నలలో కొలువెయిన కోమలివి నువ్వు అని



చెప్పలేక చేతకాక మనస్సుపడే ..ఆవేదనని



ఎలా తెలుపను ..



ప్రియా!!



ఎలా తెలుపను







నా తలపులో తోటలోని విరబూసిన ముద్దమందరానివని,



హరివిల్లుల అందాలను విరబుసుకున్నవి నీ నవ్వులు అని



చెప్పలేక ..నా ప్రేమని నీకు చూపలేక .



నా మాటలు చేసే మౌనప్రార్ధన ..నీకు ఎలా తెలుపను...



ప్రియా!



ఎలా తెలుపను.




నీ మాటల మధురిమలో మరిచిన క్షణములు ,




క్షణమే యుగములు అయిన నీకోసం చూసిన ఎదురుచూపులు ..



ఒక క్షణం నీ కోసం మనుస్సు చేసే ఆరాధన .



నువ్వు కనపడకపోతే అది పడే ఆందోళన ...



నీకు చెప్పలేక...నా ప్రేమని బయపెట్టలేక ,,




నీ ముందు నేను పడే తడబాటును ..ఎలా తెలుపను ..



ప్రియా!!



ఎలా తెలుపను

1 comments:

ఈగ హనుమాన్ (హనీ), said...

ఎగిసిపడే కెరటమా!
మీ కవితలో భావధార బావుంది, ప్రయత్నిస్తే మంచి కవి అవుతారేమో.
ఈ క్రింది నానో చదవండి:
దేహాల
చీకటిలో
దీపం
ప్రేమ-
వివరాల కోసం 'నానోలు" బ్లాగు దర్శించు మిత్రమా!
ఈగ హనుమాన్ nanolu.blogspot.com

Post a Comment