Sunday, April 26, 2009



ఒక అమ్మాయి తన తల్లితండ్రులకు దూరంగా ఉండలేక ..
పెళ్లి చేసుకోను అని చెప్పలేక .
ఆమె మనస్సు పడే మనోవేదన ..
(చివరికి చేసుకుంటారు అనుకోండి..ముందు ఈ భయం అందరికి ఉంటుంది కదా అండి )

ఏదో .

మనస్సు ఏదో..

గోల చేస్తోంది ఈనాడు .

అది ఈ రోజు వినను అంది నా గోడు ..

మా అమ్మ మాట కాదు అనలేదు నేను ఏనాడు ....

పెళ్లి అంటే వద్దు అని అంటోంది నా ఈడు ....

నాన్న చేసే గారబం..

అమ్మ చూపే అనురాగం...

అన్నతమ్ములుతో చేసే అల్లరి కోలాహలం .


అక్క చెల్లిలతో పంచుకునే చిలిపి కబురుల తీయదనం ..

నన్ను వాళ్ళ ప్రేమతో నన్ను తడిపే బంధుగణం..

ఇవ్వని వదిలి వెళ్ళడం కాదు నా తరం...

పెళ్లి చేసుకోవాలి అనే ఆచారం ??

ఉందా దాని అవసరం??

ఏమో అది అంత నాకు అనవసరం ..

నాకు వద్దు కొత్తవ్యక్తితో పరిచయం..

కొత్త మనుషుల లోగిలలో నేను చేయలేను గృహప్రవేశం ..

అల్లరి అమ్మాయని ..అర్ధాంగిగా మారాలంటే నాకు వేస్తోంది భయం

నాన్న,అమ్మ

పెళ్లి చేసుకుని నేను వెళ్ళాను మీకు దూరం ..

కాని తప్పదు "అమ్మ" అని అన్నపుడు

మీ కళ్ళలో కనపడింది బాధ్యతల భారం..

దానికి ఈ నాడు నేను తలదించక తప్పదు అంటోది నా జ్ఞానం ..

Saturday, April 25, 2009



మా మిత్రుడి నాన్నగారు మమ్మల్ని విడిచి స్వర్గహస్తులయారు..దానికి నా మనుస్సు పడిన స్పందన ..నా ఆవేదన ....




ఎవేరిని అడగను ..ఏమని అడగను ??





నాన్న ..




గుండెలపె తన్తే ఆ స్పర్శలో ఉంది అన్నారు ఆనందం




మా కోసం కష్టపడిన ..మా నవ్వులో కనపడింది అన్నారు ఆనందం ..




అలసి వచ్చిన మీకు ..అమ్మ అప్యాయతపు పలకరింపులో కనపడింది అన్నారు ఆనందం




చిట్టి చెల్లి కోసం ఆమె చేతిలో బొమ్మగా మారడంలో ఉంది అన్నారు ఆనందం .




మా బంగారు భవిష్యతు కోసం కన్నా మీ కలలో కనపడింది అన్నారు ఆనందం .



మమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళడంలో కూడా మీకు ఆనందం ఉందా




నాన్న ?????



చెప్పండి నాన్న ............











నేను మిమ్మల్ని పున్నమనరకం నుంచి తపిస్తాను అన్నారు .........




మరి మీరు వదిలివెళ్ళిన ఈ "ఒంటరితనం" నరకంను నుంచి నన్ను ఎవేరు తపిస్తారు నాన్న?




నాకు మాటలు నేర్పిన మీరు మూగపోతే ..నాకు మాటలు ఎలా వస్తాయి నాన్న?




మిమ్మల్ని రాజాలాగా సుఖపెడదము అనుకుంటే ..నాకు దూరం అయ్యి నన్ను కష్టపెడుతున్నర నాన్న?




మీలో ఆర్ధబాగం అమ్మని నేను ఎలా అనునయించగలను నాన్న?




చెల్లి చెమ్మగిల్లిన కళ్ళను ఏమని చెప్పి తుడవాలి నాన్న ?




మీ చేయి పట్టుకుని నడిచిన నేను. ఇపుడు వదిలేస్తే నేను ఎ దారిన వెళ్ళాలి నాన్న?



ఈ ప్రశ్నలకి సమాధానములు ఎవేరిని అడగను నాన్న?




మీకు దూరంగా ఈ జనారణ్యంలో ఒంటరిగా ఉన్న కాలంని అడగనా.




మీరు కనపడకపోతే అమ్మ చూసే ఎదురుచూపులను అడగనా .




"నాన్నగారు ఇంకారాలేదా " అని చెల్లి పలికే మాటలను అడగనా ...




చెప్పండి నాన్న ............




అనగా అనగా .

అది ఒక అరణ్యం.

అక్కడ ఒక ముని పొందాలి అనుకున్నాడు ఆ దేవుని అనుగ్రహం.


తప్పస్సు చేసాడు నిద్రాహారాలు మాని.

దేవుడు అతని దీక్షకు మెచ్చి ,
అడిగాడు వరములు ....కోరుకోమని.


ఓ సృస్తికర్త,

ఇదిగో నా కోరికల చిట్టా.


నాకు కావాలి ఈ భూమిమీద ఆధిపత్యం.

నన్ను చూసి భయపడాలి సత్యం..

నేను ఎక్కడ ఉంటె అక్కడ కావాలి మానవత్వం మాయం.

దయ పరుగులు పెట్టాలి దూరం...

నేను లేకపోతే మానవుడికి రావాలి కష్టకాలం.

నా గురించే ఆలోచించాలి మానవుడు జీవితకాలం.

అన్యాయముకి కావాలి నేను అండ.

సమాజంలో న్యాయ దేవత ఉండకుండా.

ఇవ్వని చేయాలి అంటే ,నాకు వద్దు మానవ రూపం.

నాకు ఇవ్వు మరో స్వరూపం.


దీనికీ ఆ సృస్తికర్త...అ ముని కి ఇచ్చాడు మానవేతర ..రూపం.

అదే నేటి సమాజంకి మూలం.

ధనం..

ఇది ధనం వెనుక ఉన్న కధనం…

Monday, April 6, 2009






ఎలా తెలుపను



ప్రియా!!



ఎలా తెలుపను



ఎదలోతులో ఎదిగిన నీ మీద అంతులేని ప్రేమని,



నా కనుసన్నలలో కొలువెయిన కోమలివి నువ్వు అని



చెప్పలేక చేతకాక మనస్సుపడే ..ఆవేదనని



ఎలా తెలుపను ..



ప్రియా!!



ఎలా తెలుపను







నా తలపులో తోటలోని విరబూసిన ముద్దమందరానివని,



హరివిల్లుల అందాలను విరబుసుకున్నవి నీ నవ్వులు అని



చెప్పలేక ..నా ప్రేమని నీకు చూపలేక .



నా మాటలు చేసే మౌనప్రార్ధన ..నీకు ఎలా తెలుపను...



ప్రియా!



ఎలా తెలుపను.




నీ మాటల మధురిమలో మరిచిన క్షణములు ,




క్షణమే యుగములు అయిన నీకోసం చూసిన ఎదురుచూపులు ..



ఒక క్షణం నీ కోసం మనుస్సు చేసే ఆరాధన .



నువ్వు కనపడకపోతే అది పడే ఆందోళన ...



నీకు చెప్పలేక...నా ప్రేమని బయపెట్టలేక ,,




నీ ముందు నేను పడే తడబాటును ..ఎలా తెలుపను ..



ప్రియా!!



ఎలా తెలుపను

Sunday, April 5, 2009


ఆ బావ నేను కాదు...మా మిత్రుడు ఆ బావ ..ఆ దేవుడి దయవల్ల నాకు మరదళ్ళులేరు

మంచుకురిసే వేళలలో మలయమారుతం

నా కనులకు "అరుణ" ఉదయం


నా జీవితపు హరివిల్లుకి ప్రేమవర్ణం,

నా పాలిట విలువయిన సువర్ణం


నా మరదలి అందం ..


ఆ అందం పిలిచే "బావ" అనే పదం


"బావ " అంటే "భార్యగా" నన్ను "వరించు "

అని నన్ను పిలుస్తూ


.. నా మరదలు నన్ను కవ్వించు



అత్తమీద భయంతో,నా మీద ప్రేమతో నువ్వు చూసే ఓరచూపులు.


అవి వర్ణించటానికి సరిపోవు ఏ కవి కలంలు..


మరదలిగా నా మదిలో మాటువేసిన ఓ ముద్దామందారమా


పత్నిగా ఎప్పుడు నా పోదరిల్లలోకి నీ పాదంపెడతావు ఓ పరువమా.!!


నువ్వు నా ప్రక్కనే ఉంటె అది వసంతం



నువ్వు లేని నాడు నాకు మిగిలేది నీ ఆలోచనల ఏకాంతం ..

నా మదిలో ప్రేమరాగాలను విన్పించిన వీణ ,



బొమ్మరిల్లు "హాసిని" పాత్రకి ప్రేరణ నువ్వేనా??



అమాయకత్వానికి ఆడపడుచు నువ్వేనా ?


మంచితనంకి మూలం నువ్వేనా ??

అనిపించకుండా ఉండదు నిన్ను చూస్తే ఎవేరికి అయినా..



నాకు నీ మీద ఉన్న ప్రేమను ...




నువ్వులేకపోతే లేని నా ప్రాణమును ..



ఈ జన్మదినమున . నా కానుక


దానితో పాటు నేను రాసిన ఈ చిన్నతవిక..

వాళ్ళ ప్రేమను నాకు వచ్చిన బాషలో రాసాను..ఇది వాళ్ళ ప్రేమకి అంకితం

Wednesday, April 1, 2009


LOVE U R LIFE..బొమ్మరిల్లు "నమ్మక తప్పని నిజమయిన "పాట దీనికీ inspiration



నడి సముద్రంలో నావలాగ .. నన్ను వదిలివెళ్ళవు .


ఆ నావికుడు గమ్యం చూడలేడు..


ఈ ప్రేమికుడు నీ మోము తప్ప ఏమి చూడలేడు..



నా మదికి ప్రేమ"హరివిల్లు" నువ్వు అనుకున్నాను .



కానీ ప్రేమ అనే వర్షం ఆగిపోతే,


నీ మమత మబ్బులు తొలగిపోతే,


పెద్దవాళ్ల వేసే ఆకాశమంత పెళ్ళిపందిరిలో కరిగిపోయే "హరివిల్లు"


అని ఇన్నాడు తెలుసుకున్నాను


ప్రేమ ఎంత మధురం ప్రియులారు కఠినం అంటే ఆ కవిహృదయం కఠినం



అని అన్నాను ఆ రోజు..


ప్రేమ అంతే గమ్యంలేకుండా చేసే ప్రయాణం,



ప్రియురాలు అంటే ఈ ప్రయాణానికి ప్రారంభం


అని అనిపిస్తుంది నాకు ఈ రోజు.


నీదే నా భారం అన్నావు,నేనే నీ సగభాగం అన్నావు ..



కానీ ఇప్పడు నీకు నేను దూరం అన్నావు,వేరొకరికి అర్ధబాగం అయ్యి వెళ్ళిపోయావు.



ఎవేరికి తలవంచదు మన ప్రేమ భయపడి ఆనాడు అన్నది నీ గుండెసవ్వడి ,


ఈ రోజు పెద్దల బాధ్యతలకు భయపడి ,మూడు ముళ్ళు వేయించుకుంటావా

నా ప్రేమవనంలో తిరుగుతున్న ఓ "లేడీ "


లోకానికి అరుణుడు అస్తమిస్తే ,అందాల చంద్రుడు ఇస్తాడు వెన్నెల వాకిలి



నీ మీద నా ఆశలు అస్తమిస్తే ,నాకు ప్రతి రోజు అమావాస్య ఓ నా చెలి


పెళ్లి చుక్కతో నీ చెక్కిలి ,భజంత్రీల ఇంటి ముంగిలి


చూస్తూ కూడా నేను ఎందుకు ఇక్కడ బతకాలి .


ఓ మరణమా !!నిన్ను ఎక్కడ అని వెతకాలి..





అని బాధపడను ..


ఓ మాయ"లేడీ"

ComeUp with new spirit

నా గుండెలో నీవల్ల వచ్చిన మంటల వెలుగులలో ..



నాలో ఆత్మవిశ్వాసానికి ఆజ్యం పోసాను..


నీ వాళ్ళ నాకు వచ్చిన బాధ నుంచి ..


బాద్యతలను స్వికరించాను .

నీ వాళ్ళ వచ్చిన ఒంటరితనం నుంచి.


ఓర్పుని అలవరచుకున్నాను ..


నీ వాళ్ళఅయిన వృదాకాలం నుంచి


వేగం నేర్చుకున్నాను ...


నా జీవితంని "సరి" చేసుకున్నాను


నా "సరి " జోడిని భాగస్వామి చేసుకున్నాను